: నోటా తప్పక వినియోగించుకోండి: అన్నా హజారే


ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చకపోతే నోటా(పై అభ్యర్థుల్లో ఎవరూ కాదు) అన్న ఆప్షన్ వినియోగించుకోవాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సూచించారు. దేశ అభివృద్ధి మంచి అభ్యర్థులతోనే సాధ్యమన్నారు. అధికారం కేవలం ఒక పార్టీ నుంచి మరొక పార్టీ చేతికి వెళ్లినంత మాత్రాన దేశ గతి మారదని, సరైన నేతలతోనే అది సాధ్యమని అభిప్రాయపడ్డారు. నేరస్థులు, అవినీతి పరులు బరిలో ఉంటే ఓటు హక్కు ద్వారా వారిని తిరస్కరించాలని సూచించారు. నోట్ల కోసం ఓటును అమ్ముకోవద్దని హితవు పలికారు.

  • Loading...

More Telugu News