: విభజన ప్రక్రియ పర్యవేక్షణకు కేంద్ర బృందం రాక
రాష్ట్ర విభజన ప్రక్రియ ఇక ఊపందుకోనుంది. ప్రస్తుతం జరుగుతున్న విభజన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతృత్వంలో కేంద్ర బృందం రేపు రాష్ట్రానికి రానుంది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమావేశం అవుతారు. అనంతరం వారు గవర్నర్ నరసింహన్ తో భేటీ అవుతారు. విభజన కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి, ఇతర ఐఏఎస్ అధికారులతో 15 కమిటీలను వేశారు. ఈ కమిటీలు ఏమేరకు పనిచేస్తున్నాయో పర్యవేక్షించడమే కేంద్ర బృందం ప్రధాన విధి.