: రెండు ప్రాంతాల్లో ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉంది: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లోనూ ఓటు అడిగే హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోనియా వల్ల అభివృద్ధి వెనక్కిపోయిందని మండిపడ్డారు. అనాలోచిత నిర్ణయంతో రెండు ప్రాంతాలను సుడిగుండంలోకి నెట్టేశారని ఆరోపించారు. ఈసారి కడప జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తామని బాబు ధీమా వ్యక్తం చేశారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అన్ని పార్టీల నేతలు టీడీపీలో కలుస్తున్నారని వ్యాఖ్యానించారు.