: 43 లక్షలు నొక్కేశారు
ఒంగోలులో పెద్ద స్కాం వెలుగు చూసింది. అక్కడి వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో భారీ మొత్తంలో నగదు మాయమైంది. ఏటీఎంలలో నగదు లేకపోవడంతో వినియోగదారులు బ్యాంకుల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన అధికారులు, నగదును ఏటీఎంలలో పెట్టే సిబ్బందే నగదును మాయం చేశారని గుర్తించారు. ఏటీఎంలలో పెట్టాల్సిన 43 లక్షల రూపాయలను నొక్కేశారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగదు ఏటీఎంలలో పెట్టే సిబ్బందిలో ఒకరు పరారీలో ఉన్నట్టు సమాచారం. అతని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.