: దళితుడికి సీఎం పదవిపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలి: మంద కృష్ణ
తెలంగాణలో దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. కేసీఆర్ స్పష్టత ఇవ్వకుంటే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 25న వరంగల్ లో జరిగే సింహగర్జన సభ ద్వారా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని మంద కృష్ణ తెలిపారు.