: ‘పశ్చిమ’లో కొనసాగుతున్న జగన్ ‘జనభేరి’


పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట జగన్ తలపెట్టిన ఎన్నికల ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు (సోమవారం) ఉదయం ఆయన బ్రాహ్మణగూడెం, కొవ్వూరుల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. రోడ్ షో అనంతరం జగన్ రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడి క్వారీ సెంటర్ లో జరిగే బహిరంగసభలో జగన్ ప్రసంగించనున్నారు. కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభమవుతుంది.

  • Loading...

More Telugu News