: మలేసియా విమానం అన్వేషణలో 26 దేశాలు


కనిపించకుండా పోయిన మలేసియా విమానం కోసం అన్వేషణ శక్తి వంచన లేకుండా సాగుతోంది. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సవాలు విసురుతున్న మలేసియా విమానం అదృశ్యం ఘటనపై దర్యాప్తులో 26 దేశాలు పాలుపంచుకుంటున్నాయి. 233 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న మలేసియా ఎయిర్ లైన్స్ విమానం మార్చి 8 తెల్లవారుజామున గల్లంతైంది. కజికిస్థాన్, దక్షిణ హిందూ మహాసముద్రం మధ్య ఉన్న ప్రాంతంలో ఈ విమానం గల్లంతయ్యే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు కజికిస్థాన్ ను అన్వేషణలో పాలుపంచుకోమని కోరారు. దీంతో ఆ దేశం కూడా అన్వేషణలో దిగింది. దీంతో, మలేసియా అన్వేషణలో 26 దేశాలు పాల్గొంటున్నాయి.

  • Loading...

More Telugu News