: వసంతోత్సవ వేడుకల్లో డప్పు కొట్టిన రాజ్ నాథ్ సింగ్


భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ నివాసంలో సోమవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. అందరూ కలిసి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా దేశప్రజలకు రాజ్ నాథ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాలను రంగులమయం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన డప్పు కొట్టి కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు.

  • Loading...

More Telugu News