: తెలంగాణలో జిల్లాకొక సభ నిర్వహిస్తా: చంద్రబాబు
ఖమ్మంలో ‘ప్రజా గర్జన’ బహిరంగ సభ విజయవంతమవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్సాహంతో ఉన్నారు. అదే తరహాలో తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ ఒకటి చొప్పున సభలను నిర్వహించనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఖమ్మంలో సభకు గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రానంత భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ అంశంలో తనది రెండు కళ్ల సిద్ధాంతమని కొందరు ఎద్దేవా చేశారని, కానీ ఇప్పుడు తాను చెప్పిందే సరైనదని ఇరు ప్రాంతాల ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.