: మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీలాంటి జిల్లా!
మనదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయితే, ఆ జిల్లాది కూడా భిన్నత్వంలో ఏకత్వమే. కేరళ శివారు జిల్లా కాసరగోడ్ జిల్లాది విభిన్న నేపథ్యం. కేరళలో ఉన్నప్పటికి కొంకణ తీరానికి, కర్ణాటకకి సరిహద్దులో ఉంటుందీ జిల్లా. అందుకే ఈ జిల్లా గురించి చెప్పాల్సి వస్తే కాసింత కర్ణాటకను, కాస్త కేరళను గోవాలో వేయిస్తే కాసరగోడ్ జిల్లా తయారవుతుందంటారు. మలయాళం, కన్నడ, కొంకణ్ ఈ జిల్లాలో అధికారికంగా చలామణి అవుతున్న భాషలు.
ఈ మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగితే ఇక్కడ రాజకీయ అరంగేట్రానికి అర్హతగా పనిచేస్తుంది. ఈ భాషలతో పాటు తుళు, మరాఠీ, ఉర్దూ, బ్యారీ భాషలు తెలిసి ఉండాలి ఈ భాషల ప్రజలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక్కడుండే చాలా గ్రామాల్లో మూడు భాషల ప్రజలు ఉండడం విశేషం. అయితే దేశం మొత్తం మీద 'విభజించు పాలించు' పద్ధతిని ఉపయోగించిన రాజకీయనేతలు ఇక్కడ మాత్రం ప్రజల్ని విడదీయలేదు. ఎన్నికల నేపథ్యంలోనూ వీరందర్నీ ఏకతాటిపై నడిపారు ఇక్కడి రాజకీయ నాయకులు.