: వైఎస్ కు నివాళులర్పించిన షర్మిల


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన కుమార్తె షర్మిల ఈరోజు (సోమవారం) నివాళులర్పించారు. బెంగళూరు నుంచి నేరుగా షర్మిల ఈరోజు మధ్యాహ్నం కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద పూలమాలలు వేసి ఆమె అంజలి ఘటించారు.

అనంతరం షర్మిల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా బయల్దేరి వెళ్లనున్నారు. ‘జనపథం’ పేరుతో జిల్లాలో ఎన్నికల ప్రచారభేరిని మోగించనున్నారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఆమె ప్రచారం నిర్వహిస్తారు. ఈ ప్రచారంలో భాగంగా వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు నియోజకవర్గాల్లో ఆమె రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News