: మోడీది కుత్సిత బుద్ధి.. ఆయనో మతోన్మాది: అఖిలేశ్ యాదవ్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆయనది కుత్సిత బుద్ధి అని, ఆయనో మతతత్వ వాది అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు లౌకికవాదులకే ఓటేయాలని అఖిలేశ్ సూచించారు. ప్రధాని కావాలనుకునే వ్యక్తికి విశాల హృదయం ఉండాలని, మతతత్వవాదులు ఎన్నటికీ ప్రధాని కాలేరని ఆయన స్పష్టం చేశారు.