: ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యా: సన్నీలియోన్


నీలి చిత్రాల్లో నటిస్తున్నపుడు కూడా సన్నీలియోన్ అంత ఒత్తిడికి గురికాలేదేమో గానీ... మోడల్ గా ర్యాంప్ పై ఒయ్యారాలు ఒలికించడానికి మాత్రం ఆందోళనకు గురైందట. లాక్మే ఫ్యాషన్ వీక్-2014లో భాగంగా నిన్న ముంబైలో సన్నీలియోన్ క్యాట్ వాక్ చేసింది. డిజైనర్ జ్యోత్స్న తివారీ రూపొందించిన గౌన్ ను ధరించి ర్యాంపుపై నడుస్తున్నప్పుడు ఒత్తిడికి లోనయ్యానని సన్నీలియోన్ తెలిపింది. అయితే, గౌన్ మాత్రం చాలా సౌకర్యంగా ఉందని చెప్పింది. ప్రతీ ఒక్కరూ దీన్ని వేసుకోవడానికి ఎంతో ఇష్టపడతారంది. సాధారణ మేకప్ తో గౌన్ వేసుకుని సన్నీ చేసిన క్యాట్ వాక్ అదిరిపోయిందని ఫ్యాషన్ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News