: బాబ్బాబూ... ఏప్రిల్ 15 వరకు కరెంటు కోతలొద్దు!
రాష్ట్రంలో పంటలు ఎండిపోకుండా చూడాలని, ఏప్రిల్ 15 వరకు సాగునీటికి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. లోవోల్టేజీ కరెంట్ తో రోజుకు 3 గంటలకు మించి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. కరెంటు కోతలతో సకాలంలో నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా బ్యారేజ్ కు నీటిని పంపిణీ చేయాలని ఆయన కోరారు. విద్యుత్ కోతలు విధించకుండా ట్రాన్స్ కో అధికారులను ఆదేశించాలని చంద్రబాబు విన్నవించారు.