: గిరిజన మహిళలతో చంద్రబాబు హోలీ


టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గిరిజన మహిళలు పాల్గొని బాబుకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొని రంగులు చల్లుకుని హోలీ జరుపుకున్నారు. ప్రజల కలలు సాకారమైనప్పుడే నిజమైన హోలీ పండుగ అని బాబు అన్నారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా హోలీ జరుపుకోలేకపోయారన్నారు. ఈసారి ఆ పాలన అంతమవుతున్నందున సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News