: కిరణ్ ఏం త్యాగం చేశారో చెప్పాలి...మళ్లీ పార్టీలోకి రండి: రఘువీరా


మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆవేశంతో పార్టీవీడిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా ఎంపీలంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అన్ని పార్టీల అంగీకారం మేరకే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. స్వలాభం కోసమే నేతలు పార్టీ వీడుతున్నారని ఆయన విమర్శించారు.

సీమాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. పార్టీ వీడుతారని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలతో రఘువీరా ఫోన్ లో మాట్లాడి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ వీడే వారి జాబితా పంపాలని జిల్లా అధ్యక్షులకు రఘువీరా ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News