: కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తే లేదు: కిరణ్
భవిష్యత్తులో కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తే లేదని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదయం సమైక్యాంధ్ర జేఏసీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవి కోసం తాను పార్టీ పెట్టలేదని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకే పార్టీ పెట్టానన్నారు. 371 డీ వల్ల ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితి వస్తుందన్నారు. విభజన బిల్లు అక్రమమని పలు పార్టీలు పార్లమెంటులో ఆందోళన చేశాయని, బీజేపీ కూడా రాజ్యసభలో ఇదే చెప్పిందనీ అన్నారు.