: ప్లీజ్ ... సింగపూర్ రాకండి: సుమలత


తన భర్తను పరామర్శించడానికి సన్నిహితులెవరూ సింగపూర్ రావద్దని నటి సుమలత విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నటుడు, రాజకీయవేత్త అంబరీష్ సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కు చికిత్స తీసుకుని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. దీంతో ఆయనను పరామర్శించేందుకు సన్నిహితులు, అభిమానులు భారీ సంఖ్యలో సింగపూర్ వెళుతున్నారు. ప్రస్తుతం అంబరీష్ వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని... ఇతరులను వార్డులోకి అనుమతించడం లేదని... అందువల్ల ఎవరూ సింగపూర్ రావద్దని సుమలత కోరారు.

  • Loading...

More Telugu News