: నరేంద్ర మోడీపై పోటీ చేసే విషయం ఆలోచిస్తున్నా: కేజ్రీవాల్
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేసే విషయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటానని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వారణాసిలో మోడీతో తలపడేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ అంశానికి సంబంధించి 23వ తేదీన వారణాసిలో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రకటిస్తానని కేజ్రీవాల్ తెలిపారు.