: 72 పరుగులకు ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్
టీ20 ప్రపంచకప్ లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ చేతులెత్తేసింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్ లో ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్ 17.1 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వీటిలో 12 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో వచ్చాయి. గుల్బదిన్ నయీబ్ చేసిన 21 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఎనిమిది మంది బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరుకు చేరుకోలేకపోయారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3, అబ్దుర్ రజాక్ 2, మొర్తజా, ఫర్హద్ రెజా, మహ్ముదుల్లాలు చెరో వికెట్ తీసుకున్నారు.