: టీడీపీతో నేనేం మాట్లాడలేదు: కావూరి
తెలుగుదేశం పార్టీతో తానేమీ సంప్రదింపులు జరపలేదని కేంద్ర మంత్రి కావూరి స్పష్టం చేశారు. ఈరోజు కావూరి సాంబశివరావు ఏలూరులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా కాకుండా, పదవీ కాంక్షతోనే ముందుకు పోతోందని ఆయన ఆరోపించారు. సొంత పార్టీపైనే విమర్శలు కురిపించడంతో కావూరి పార్టీ వీడుతున్నారనే వార్తలు వినవస్తున్నాయి. అయితే, తాను పార్టీలో ఉండాలా? వద్దా? అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకొంటానని ఆయన తేల్చి చెప్పారు.