: వారణాసిలో మోడీ ఓటమి ఖాయం: లాలూ
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గంలో మోడీకి ఓటమి తప్పదని... ప్రజలు ఓడిస్తారని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. వారణాసి లౌకిక ప్రాంతమని... అలాంటి చోట మోడీలాంటి మతతత్వవాదికి ఓటమే మిగులుతుందని తెలిపారు. మతతత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ పనిచేస్తుందని... మోడీ ప్రధాని కాకుండా చూడటమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. వారణాసి నుంచి మోడీ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.