: బాబు పాలనలో ప్రజలు నరకం అనుభవించారు: భూమన
జనం జగన్ కే జై కొడుతున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ ను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఆల్ ఫ్రీ హామీలిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పెద్ద అబద్దాలకోరు అని... ఆయన హామీలు ఆచరణ సాధ్యం కావని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు నరకం అనుభవించారని చెప్పారు. జగనన్న నాయకత్వంపై నమ్మకంతో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని తెలిపారు.