: కేజ్రీవాల్ విందు భళా... రూ.50 లక్షల ఆదాయం
కేజ్రీవాల్ విందు అదిరింది. నిన్న రాత్రి బెంగళూరులో నిర్వహించిన పెయిడ్ విందుకు 200 మంది ఖరీదైన అతిథులు వచ్చారు. వారిచ్చిన విరాళాల ద్వారా 50 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. పార్టీ విరాళాల కోసం కేజ్రీవాల్ అంతకుముందు మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోనూ పెయిడ్ విందు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యధికంగా విరాళాలు వచ్చే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి. అందుకే కేజ్రీవాల్ మహారాష్ట్రలో ఒకటి, కర్ణాటకలో ఒకటి నిర్వహించారు. నిన్న రాత్రి విందులో పాల్గొన్న ఖరీదైన అతిథులు కేజ్రీవాల్ ను పలు అంశాలపై ప్రశ్నించారు. ఇందులో మీడియాపై ఆయన చేసిన విమర్శలు కూడా ఉన్నాయి.