: ఈ నెలాఖరుకల్లా కాంగ్రెస్ తుది జాబితా: డిగ్గీరాజా
ఈ నెలాఖరుకల్లా పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారవుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎ.కె. ఆంటోని నేతృత్వంలోని ఏఐసీసీ కమిటీ జాబితాను ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. ఈ నెల 24వ తేదీలోగా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్న నేతల జాబితాను తమకు పంపాలని ఇరు ప్రాంతాల ఎన్నికల కమిటీలను దిగ్విజయ్ ఆదేశించారు.