: కైఫ్ తరపున సచిన్, గంగూలీ తదితర దిగ్గజాల ప్రచారం
క్రికెటర్ మహహ్మద్ కైఫ్ తరపున సచిన్, గంగూలీ వంటి క్రికెట్ దిగ్గజాలు ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కైఫ్ కు ఉత్తరప్రదేశ్ లోని పూల్ పూర్ లోక్ సభ స్థానాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తాను సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్ వంటి వారిని సంప్రదించానని, వారు తనకు అభినందనలు తెలిపారని కైఫ్ వెల్లడించారు. వీలు చూసుకుని తన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని వారు హామీ ఇచ్చారని చెప్పారు. అలహాబాద్, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయడం కోసం తనకు తగిన వేదిక లభించిందన్నారు.