: నేడు కావూరి ఆత్మీయ సమావేశం... కాంగ్రెస్ కు గుడ్ బై?


కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు ఈ రోజు ఏలూరులో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉంటే ఎలాగూ గెలిచే అవకాశం లేదన్న అంచనాల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పార్టీని వీడడానికి సంకేతంగానా అన్నట్లు నిన్న జరిగిన సీమాంధ్ర పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశానికి కావూరి హాజరు కాలేదు. ఈ కమిటీలో కావూరి సభ్యుడిగా ఉన్నారు. తాను పార్టీని వీడనున్నట్లు కావూరి ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ కు చెప్పినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News