: టీ20 ప్రపంచకప్ నేటి నుంచే


పొట్టి క్రికెట్ లో మరో మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. బంగ్లాదేశ్ లో నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతోంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ల మధ్య తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్ జరగబోతోంది. అనంతరం రాత్రి 7 గంటలకు రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్ లో హాంకాంగ్, నేపాల్ జట్లు తలపడుతాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడుతున్నాయి. టాప్-8 జట్లు నేరుగా సూపర్-10లో పాల్గొంటాయి. మిగిలిన 8 జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్ లు ఆడతాయి. వీటిలో రెండు టీంలు సూపర్-10కి అర్హత సాధిస్తాయి.

  • Loading...

More Telugu News