: బృందావనంలో చిన్ని కృష్ణుడికి 70 అంతస్తుల ఆలయం
భగవంతుడైన శ్రీకృష్ణుడు.. చిన్నికృష్ణుడిగా నడచిన నేల ఉత్తరప్రదేశ్ లోని బృందావనం. ఆ పవిత్ర స్థలంలో నల్లనయ్యకు ప్రపంచంలోనే అత్యద్భుతమైన స్థాయిలో ఆలయం నిర్మించాలని అంతర్జాతీయ కృష్ణ భక్త సమాజం (ఇస్కాన్) నిర్ణయించింది. ఈ రోజే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. 62 ఎకరాల విస్తీర్ణంలో 213 మీటర్ల ఎత్తులో 70 అంతస్తులుగా దీన్ని నిర్మించనున్నారు. చుట్టూ 30 ఎకరాల పరిధిలో ఉద్యానవనాన్ని పెంచుతారు. ఏడాది పొడవునా విశేష సేవలు జరుగుతాయి.