: వ్యవస్థలన్నీ చిక్కి శల్యమౌతున్నాయ్ : హరీష్ రావు
ఇంటి అవసరాలకు, వ్యవసాయానికి తగినంత విద్యుత్తును అందించలేని కాంగ్రెస్ సర్కారు గద్దెదిగాలని టీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రం విద్యుత్ సమస్యతో అలమటిస్తోన్నా ప్రభుత్వ పెద్దలు చేతకాని స్థితిలో ఉన్నారని ఆయన విమర్శించారు.
విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలంటూ వామపక్షాలు ఇందిరాపార్క్ వద్ద చేస్తోన్న విద్యుత్ దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి నేతలను పరామర్శించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలన్నీ చిక్కి శల్యమైపోయాయని ఈ సందర్భంగా హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా, వామపక్షాల విద్యుత్ దీక్ష నేటికి నాలుగోరోజుకి చేరింది.