: గొర్రెలు, నక్క కథ చెప్పిన కొత్తపల్లి సుబ్బారాయుడు
తల్లి పార్టీ, పిల్ల పార్టీ కొట్టుకుంటూ ఉంటే, మధ్యలో అధికారం కాజేయాలని తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. విద్యుత్తు సమస్యపై శాసనసభలో జరుగుతోన్న చర్చలో ఆయన పాల్గొన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రధాన సమస్యలపై నిర్మాణాత్మక సలహాలివ్వకుండా లేనిపోని రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.
ఈ సందర్భంలో టీడీపీని ఉద్దేశించి కొత్తపల్లి ఓ కథ చెప్పారు. ఓ అడవిలో రెండు గొర్రెలు పోట్లాడుకుంటున్నాయని, ఆ సందర్భంలో ఓ నక్క అక్కడకి చేరిందని.. ఆ రెండు గొర్రెలు పోట్లాడుకొని.. పోట్లాడుకొని చనిపోతే రెండుగొర్రెల్నీ తినేయొచ్చని నక్క ఎదురు చూస్తోందంటూ శాసనసభలో గెర్రెలు, నక్క కథ చెప్పుకొచ్చారు.
కొత్తపల్లి సభలో ప్రసంగిస్తోన్న తరుణంలో టీడీపీ సభ్యులు వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్ ల నుద్ధేశించి తల్లిపార్టీ, పిల్ల పార్టీ అంటూ నినాదాలు చేస్తోన్న సందర్భంలో ఆయన ఈ కథ వినిపించారు.