: సామాజిక సమస్యలపై శిల్పాశెట్టి దంపతుల 'టీవీ షో'
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, వ్యాపార వేత్త రాజ్ కుంద్రాలు టీవీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ మేరకు సామాజిక సమస్యలపై ఓ టీవీ షో నిర్వహించాలని ప్రణాళిక వేస్తున్నారు. అయితే, తమ కార్యక్రమానికి, అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న 'సత్యమేవ జయతే' తో ఎలాంటి పోలికలు ఉండవని, విభిన్న రూపంలో రూపొందుతుందని అంటున్నారు. ప్రస్తుతం కార్యక్రమం ప్రసార వివరాలు, మిగతా విషయాలపై దృష్టి పెట్టినట్లు కుంద్రా తెలిపాడు. 'భారత భాగ్య విధాత' పేరుతో నిర్వహించే కార్యక్రమానికి ఓ మ్యూజిక్ వీడియోను తయారు చేయించినట్లు వివరించాడు.