: సెకన్లలోనే ముక్కలు ముక్కలుగా నరికేస్తా!
16 సెకన్లలో గుమ్మడికాయను ముక్కలు ముక్కలుగా చేయగలరా? దాంతో అందమైన బొమ్మలు చెక్కగలరా? చూడకుండానే నిమిషాల్లో కూరగాయలు తరగగలరా? కానీ, చెన్నైకి చెందిన చెఫ్ వినోద్ కుమార్ మాత్రం ఇవన్నీ చేసి చూపించారు. ఆయన చెన్నైలోని ఎస్ఏఐ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ లో చెఫ్ గా పనిచేస్తున్నారు. చెన్నైలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వినోద్ కుమార్ ఈ ఫీట్ సాధించారు. ఈ ఫీట్ చూసిన వీక్షకులు నోరెళ్లబెట్టారు. అంతేకాదు, ‘గిన్నీస్’ ప్రతినిధులు బహుమతి ప్రదానం చేసి మరీ వినోద్ పేరును గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించేశారు.