: తెలంగాణ భవన్ ఎదుట బీసీ నేతల ఆందోళన


తెలంగాణ భవన్ (టీఆర్ఎస్ కార్యాలయం) ఎదుట బీసీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆయనకు నియోజక వర్గ బాధ్యతలను అప్పగించారు. దీనిపై ఆ పార్టీ బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజుల నుంచి పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించి... దివాకర్ రావుకు బాధ్యతలను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. పరిస్థితి తీవ్రతరం అవుతుండటంతో, ఆ పార్టీ నేత హరీష్ రావు వచ్చి వారితో చర్చించి, శాంతింపజేశారు.

  • Loading...

More Telugu News