: 24 యుద్ధ విమానాల కొనుగోలుకు చైనా రెడీ


దేశ రక్షణ విషయంలో మరింత ముందుచూపుతో వ్యవహరిస్తున్న చైనా,  అందుకు రక్షణ బడ్జెట్ లో ఎక్కువమొత్తం నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 24 యుద్ధ విమానాలను, నాలుగు జలాంతర్గాములను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించింది. ఆ దేశ  మీడియా  కథనాల ప్రకారం.. దశాబ్దకాలం తర్వాత  ఇంత పెద్ద మొత్తంలో రష్యా నుంచి కొనుగోలు చేయడం ఇదే మొదటిసారని పేర్కొంది.

ఇందులో రెండు జలాంతర్గాములను రష్యాలో, మరో రెండింటిని చైనాలో నిర్మించనున్నారు. గతవారం మాస్కోలో చైనా నూతన అధ్యక్షుడు జి జిన్ పింగ్ పర్యటించారు. దీనికి ముందే సైనిక సహకారంపై రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారని బిబిసి తెలిపింది. దీని ప్రకారమే ఇప్పుడు వీటి కొనుగోలుకు అనుమతి తెలిపినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News