: పవన్ పిలుపునివ్వడం సంతోషదాయకం: వెంకయ్యనాయుడు
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ హవా పెరుగుతోందని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తెలంగాణ, సీమాంధ్రలలో బీజేపీ శ్రేణుల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. మోడీకి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోందని తెలిపారు. పవన్ కల్యాణ్ పార్టీ, ఆయన ప్రసంగం గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని పవన్ పిలుపునివ్వడం సంతోషదాయకం అని చెప్పారు. తానెవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని... భవిష్యత్తులో పవన్ తో కలసి పనిచేసే విషయం ఆలోచిస్తామని తెలిపారు.