: తల్లీకూతుళ్ల సజీవదహనం
అనంతపురం పట్టణంలో ఓ గుడిసెలో తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం అనంతపురం పట్టణ పరిధిలోని నీలం రాజశేఖర్ రెడ్డి కాలనీలో ఆటో డ్రైవర్ ప్రసాద్ తన భార్య సరస్వతి(40), కుమార్తె ప్రత్యూష(15)లు ఓ గుడిసెలో నివాసముంటున్నారు. ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకోవడంతో తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.