: కాంగ్రెస్ ను అంతం చేయడం ఎవరి తరం కాదు: పవన్ కామెంట్లకు చిరంజీవి రియాక్షన్
పవన్ కల్యాణ్ పార్టీపై ఆయన సోదరుడు చిరంజీవి స్పందించారు. గతంలో ఎంతో మంది కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు... కానీ, అది ఎవరి తరం కాలేదని అన్నారు. కాంగ్రెస్ వైపు వేలు చూపే ముందు మిగతా పార్టీల వైపు కూడా చూడాలని తమ్ముడికి సూచించారు. తాను భారతీయుడినని పవన్ చెప్పడం సంతోషకరమని తెలిపారు. అయితే, బ్రిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని... కాంగ్రెస్ వల్లే భారతీయుడిని అని చెప్పుకునే అవకాశం కలిగిందని చెప్పారు. పవన్ పార్టీ అజెండా, పూర్తి వివరాలు తనకు తెలియదని వెల్లడించారు. పవన్ పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగతమని, ఎలా పనిచేస్తారో చూద్దామని అన్నారు.