: లాలూపై కేసుల విషయంలో సీబీఐపై సొలిసిటర్ జనరల్ ఆగ్రహం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై ఉన్న కేసుల విషయంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరణ్ సీబీఐపై మండిపడ్డారు. దాణా కుంభకోణం వ్యవహారంలో ఆయనపై పెండింగ్ లో ఉన్న మూడు కేసులను ఎత్తివేయాలని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా నిర్ణయం తీసుకున్నట్లు నిన్న పేర్కొన్నారు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన సొలిసిటర్ జనరల్, కేసుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకోవల్సింది కోర్టే గాని సీబీఐ కాదని స్పష్టం చేశారు.