: జయలలితపై విమర్శలు ఎక్కుపెట్టిన తమిళ హీరో


తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శలతో తిరువళ్లూరు నియోజకవర్గంలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు ప్రారంభించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, విద్యుత్ కోతలు తదితర సమస్యలను ప్రచారాస్త్రాలుగా ఎంచుకున్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. విద్యుత్తే లేనప్పుడు ఉచితంగా వచ్చే ఫ్యాన్ల వల్ల ఉపయోగం ఏంటని ప్రజలను ప్రశ్నించారు. జయలలిత ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ప్రస్తావించారు. అవినీతి నేతలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News