: ఏ తండ్రి అయినా అలా అంటాడా?: సోనమ్ కపూర్


బికినీ షాట్ వల్ల మంచి ఓపెనింగ్స్ వస్తాయని మీడియాలో ప్రసారమైన వార్తలపై సినీనటి సోనమ్ కపూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా ప్రపంచంలో నిజాయతీ పనికి రాదని మండిపడుతోంది. తన తండ్రి బేవకూఫియా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని చెప్పినట్టు తానన్నానని... మీడియా వక్రీకరించిందని ఆమె మండిపడింది. ఏ తండ్రి అయినా అలా అంటారా? అని ఆమె మీడియాను ప్రశ్నించింది.

తాను చెప్పిన విషయాలు అనువాద లోపం వల్ల కూడా చాలా వరకు రాకుండా పోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది ఏమయినా మీడియాతో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలుసుకున్నట్టు తెలిపింది. సినీ ప్రపంచంలో నిజాయతీగా మాట్లాడడం అస్సలు మంచిది కాదని అభిప్రాయపడ్డ సోనమ్ కపూర్, బికినీ తనంట తానే ధరించానని నిజాయతీగా చెప్పింది.

  • Loading...

More Telugu News