: ఇవాళ్టి నుంచి పిల్లలకు ఒంటిపూట బడులు
వేసవి కాలం మొదలుకావడంతో ఎండలు మండుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒంటిపూట బడులు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మాత్రమే పాఠశాలల్లో తరగతులను నిర్వహించనున్నారు. అయితే, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.