: పనిచేసే చోట ఆరెంజ్ లైట్ ఉందా?


బ్లూ రంగు వెలుతురు అలసట రానీయదని గతంలో పలు పరిశోధనలు నిరూపించాయి. అయితే, పనిచేసే చోట ఆరెంజ్ కలర్ లైట్ ఉంటే ఉత్పాదకత ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆరెంజ్ లైట్ ఉంటే ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి పనిలో సాగిపోతారట. బ్లూ కంటే ఆరెంజ్ వెలుగు మస్తిష్కాన్ని ఎక్కువగా పనిచేయించేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. బెల్జియంకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. వలంటీర్లను ఒక గదిలో ఉంచి వివిధ రకాల రంగులు వారి కళ్లపై పడినప్పుడు వారి మస్తిష్కంలో జరిగే మార్పులను ఎంఆర్ఐ పరీక్షల ద్వారా పరిశీలించారు. ఒక్కో రంగు వెలుతురుకి మెదడులోని మెలనోస్పిన్ ఒక్కోలా స్పందించినట్లు తేలింది. ముఖ్యంగా బ్లూ రంగు కంటే ఆరెంజ్ రంగులో వలంటీర్ల మెదడు పనితీరు చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు.

  • Loading...

More Telugu News