: గూగుల్ హ్యాంగ్ అవుట్ ద్వారా రాహుల్ వీడియో చాటింగ్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైటెక్ పద్ధతిలో కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో గూగుల్ హ్యాంగ్ అవుట్ ద్వారా కార్యకర్తలతో రాహుల్ వీడియో చాటింగ్ చేస్తున్నారు. పలు సర్వేల్లో కాంగ్రెస్ ఓడిపోతుందన్న ఫలితాల ప్రచారంపై కార్యకర్తలు ప్రశ్నలు సంధించారు. దానిపై ఎవరూ నిరుత్సాహానికి గురి కావద్దని, వచ్చే ఎన్నికల్లో తప్పక గెలుస్తామని రాహుల్ వారికి భరోసా ఇచ్చారు. అయితే, ఎమ్మెల్యేలు, ఎంపీల ఎంపికలో కాంగ్రెస్ కార్యకర్తలను భాగస్వాములు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కార్యకర్తలతో రాహుల్ చాటింగ్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News