: రెండు స్థానాల్లో పోటీ చేయడాన్ని నిరోధించాలని కోరుతూ సుప్రీంలో పిల్
చట్ట సభలకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు ఒకటికి మించిన స్థానాల్లో పోటీ చేయకుండా చూడాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఒక న్యాయవాది దీన్ని దాఖలు చేశారు. ఒకటికి మించిన స్థానాల్లో పోటీ చేస్తే అభ్యర్థుల నామినేషన్లు చెల్లవని ప్రకటించాలని కోరారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 70 అభ్యర్థులను ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో (శాసనసభ లేదా లోక్ సభ) పోటీ చేసేందుకు అనుమతిస్తోంది. రెండింటిలోనూ గెలిస్తే ఒక స్థానానికి నిర్ణీత సమయంలోగా రాజీనామా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. దీంతో ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.