: శంకరరావు అరెస్టు ఉదంతంపై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం


మాజీ మంత్రి శంకరరావును గురువారం అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. సీఐడీ అదనపు డీజీ కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో మొత్తం ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం తన ఆదేశాల్లో పేర్కొన్నారు. పోలీసులు అతిగా ప్రవర్తించారని పలువురు మంత్రుల నుంచి ఫిర్యాదులు అందటంతో ఈ మేరకు కిరణ్ విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News