: పవన్ వ్యాఖ్యలపై సాయంత్రం మీడియాతో మాట్లాడతా: చిరంజీవి


తమ్ముడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన 'జనసేన' పార్టీపై స్పందించేందుకు ఎట్టకేలకు కేంద్ర మంత్రి చిరంజీవి సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటు సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అప్పుడే చిరు అంతా వివరంగా మాట్లాడతారని తెలుస్తోంది. తన ప్రసంగం ఆద్యంతం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్.. 'కాంగ్రెస్ హఠావో' అంటూ పిలుపునిచ్చారు. మరి అదే పార్టీలో ఉన్న తన అన్న అయిన చిరు వీటిపై ఎలా స్పందిస్తారు? ఏం మాట్లాడతారు? అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News