: గన్నవరంపై కన్నేసిన దేవినేని నెహ్రూ
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియన్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) విజయవాడకు ఆనుకుని ఉన్న గన్నవరం స్థానంపై కన్నేసినట్టు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. తూర్పు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవి రానున్న ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేయాలని భావిస్తుండటంతో... నెహ్రూ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన గన్నవరం కాంగ్రెస్ నేతలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నున్నలో విజయవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.