: వారి మధ్య ఒప్పందం ఏమిటో బయటపెట్టాలి: సబ్బం హరి
రాష్ట్ర విభజన ప్రక్రియలో లోక్ సభలో ఒకలా, రాజ్యసభలో మరోలా ప్రవర్తించిందని బీజేపీపై సబ్బం హరి మండిపడ్డారు. ఈ వ్యవహారమంతా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో ఎవరు చిత్తశుద్ధితో పనిచేశారు? ఎవరు నటించారు? అనే విషయం ప్రజలకు తెలుసని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, సబ్బం హరి ఈ వ్యాఖ్యలు చేశారు. విభజన జరగక ముందు పవన్ కల్యాణ్ మాట్లాడి ఉంటే చాలా బాగుందేదని అన్నారు.