: యూజీసీ నెట్ ఫలితాలు విడుదల
ఐదు సంవత్సరాల పరిశోధనకు గానూ నిర్వహించే యూజీసీ నెట్ అర్హత పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్ 30, 2012న నిర్వహించిన ఈ పరీక్షను 7లక్షల 8వేల మంది అభ్యర్ధులు రాయగా, 39,226 మంది లెక్చరర్ షిప్ కు అర్హత సాధించినట్లు తెలిపారు. వీరిలో జూనియర్ రీసెర్చ్ స్కాలర్ షిప్ విభాగానికి 3,669 మంది అర్హత పొందినట్లు యూజీసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. సమాధాన 'కీ' పత్రాన్ని, ప్రశ్నాపత్రాలను యూజీసీ వెబ్ సైట్ లో ఉంచారు.